కోనసీమలో కొబ్బరి పరిశోధన కేంద్రం

31 Aug, 2019 14:36 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: కోనసీమలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రపప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శనివారం కాకినాడ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల మాట్లాడుతూ.. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి  స్ఫూర్తితో పాలన చేస్తున్నామని, అందుకే రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలకు వైఎస్సార్‌ పేరు పెడుతున్నామని అన్నారు. రైతులకు ఉపయోగపడే మొక్కలను అటవీశాఖ ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో.. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు.

జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు పది లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కురసాల తెలిపారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు వ్యవసాయ, ఉద్యానవన, అటవీశాఖలు సమన్వయం కావాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక ఆయా శాఖలు రైతులకు మొక్కల పెంపకంపై అవగాహన కలిపించాలని అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు