గతంలో పెన్షన్‌‌ పొందలేనివారికి ‘మే’ అందిస్తాం

2 May, 2020 15:21 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది

సాక్షి, అమరాతి : లాక్‌డౌన్‌ కారణంగా మార్చి, ఏప్రిల్‌ నెలలో పెన్షన్‌‌ పొందలేని వారికి మే నెలలో పెన్షన్ డబ్బులు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గత రెండు నెలల్లో పెన్షన్ డబ్బులు ‌ తీసుకోని వారికి ఈ నెలలో మొత్తం చెల్లిస్తామని చెప్పారు.  ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న పెన్షన్‌ దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికి పింఛన్‌ డబ్బులు అందేలా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. 
(చదవండి : రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్ కానుక పంపిణీ)

కాగా, కరోనా వైరస్ సృష్టిస్తున్న ఆలజడిలోనూ ఏపీ ప్రభుత్వం పట్టుదలతో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది. ప్రతినెలా ఒకటో తేదీనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గుర్తించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి పెన్షన్ సొమ్మును వారి చేతికే అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను ప్రభుత్వ యంత్రాంగం, వాలంటీర్ల వ్యవస్థ ఉద్యమ స్పూర్తితో నెరవేర్చింది. శుక్రవారం ఉదయం నుంచే వాలంటీర్లు తమకు కేటాయించిన యాబై ఇళ్ళ పరిధిలోని ‘వైఎస్సార్‌ పెన్షన్ కానుక’ లబ్ధిదారుల వద్దకు వెళ్ళి వారికి స్వయంగా పెన్షన్ సొమ్మును అందించారు.

మరిన్ని వార్తలు