9 మందితో ఉన్నతస్థాయి కమిటీ

1 Jul, 2019 12:29 IST|Sakshi

సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో సోలార్‌, పవన విద్యుత్‌ కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో ట్రాన్స్‌ కో సీఎండీ కన్వీనర్‌గా తొమ్మిది మందితో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, అడ్వకేట్‌ జనరల్‌, అజయ్‌కల్లాం, రావత్‌, ఇంధన శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలపై సంప్రదింపులు జరుపనుంది. అదే విధంగా గత ప్రభుత్వంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన సోలార్, విండ్ పవర్ ధరలను సమీక్షించనుంది. డిస్కంలకు తక్కువ ధరలకు అమ్మేవారితో కూడా సంప్రదింపులు చేయనుంది. గతంలో ఉన్న ధరలు, ప్రస్తుత ధరలపై రివ్యూ చేయనుంది.

>
మరిన్ని వార్తలు