విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్‌

7 Feb, 2020 18:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలోని మెట్రో రైలు ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్‌ రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొటేషన్లు పిలించేందుకు అమరావతి మెట్రో రైలు ఎండీకి ఆదేశాలు ఇచ్చింది. విశాఖలో 79.9 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం కోసం కొత్త డీపీఆర్‌లను రూపొందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టబోతుంది. (8 కారిడార్లు.. 140.13 కి.మీ)

గతంలో డీపీఆర్‌ రూపకల్పన కోసం ఎస్సెల్‌ ఇన్ఫ్రా కాన్సార్షియం కు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపాదనల రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌, రైట్స్‌, యూఎంటీసీ తదితర సంస్థలను సంప్రదించాల్సిందిగా ప్రభుత్వం ఉత్వరుల్లో పేర్కొంది. మూడు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణం  కోసం డీపీఆర్‌ల రూపకల్పనతో పాటు 60 కిలోమీటర్ల మేర మోడరన్‌ ట్రామ్‌ కారిడార్‌ ఏర్పాటుకు మరో డీపీఆర్‌ను సిద్ధం చేసేందుకు ప్రతిపాదనల్ని స్వీకరించాలని ప్రభుత్వం సూచించింది. (మెట్రో రీ టెండరింగ్)


(విశాఖ మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు)

మరిన్ని వార్తలు