ఏపీలో ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలు

19 Apr, 2016 20:13 IST|Sakshi

మలికిపురం/ మామిడికుదురు (తూర్పుగోదావరి): రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు ఇక కంప్యూటర్ జనరేటెడ్ బిల్లులు ఇవ్వాలని  నిర్ణయించినట్టు ఎక్సైజ్, బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిమండ, అప్పన్నపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో మద్యాన్ని ఎమ్మార్పీకంటే అధికంగా అమ్ముతున్నారని, ఎక్సైజ్ శాఖలో అవినీతి అధికంగా ఉందని వస్తున్న ఆరోపణలను ప్రస్తావించగా.. మద్యం కొనుగోలు చేసిన ప్రతి వ్యక్తికీ షాపులో కంప్యూటర్ బిల్లు ఇచ్చేలా ఆన్‌లైన్ విధానం నెల రోజుల్లో అమలు చేయనున్నట్టు తెలిపారు. మద్యం ధరల వివరాలు ముందుగానే ఈ కంప్యూటర్లో పొందుపరిచి వుండగా వాటి ప్రకారమే బిల్లు వస్తుంది. తాగుడు వల్ల కలిగే అనర్థాలను వివరించి మద్యం నుంచి ప్రజలను దూరం చేసేందుకు, బెల్ట్‌షాపులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు