శిల్పా గన్‌మెన్లను తొలగించిన ఏపీ సర్కార్‌

18 Nov, 2017 20:07 IST|Sakshi

సాక్షి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డికి భద్రతగా ఉన్న గన్‌మెన్లను ఏపీ ప్రభుత్వం వెనుకకు తీసుకుంది. ఆయనకు ఎలాంటి ప్రాణహాని లేదనే ఉద్దేశంతో సెక్యూరిటీని ఉపసంహరిస్తున్నట్లు ఏపీ సర్కారు ఓ పంపింది. 

శిల్పా చక్రపాణిరెడ్డి భద్రతా విషయంలో ఏపీ సర్కారు తీరుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శిల్పాకు గన్‌మెన్‌ల ఉపసంహరణ కక్ష సాధింపు చర్యనని పార్టీ నేతలు మండిపడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో శిల్పా చక్రపాణి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికలు ముగిసిన అనంతరం శిల్పా చక్రపాణిరెడ్డి లక్ష్యంగా కాల్పులు కూడా జరిగాయి. అయినప్పటికీ శిల్పాకు సెక్యూరిటీ ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు