బాల్యంపై ‘బళ్లెం’

3 Dec, 2018 12:21 IST|Sakshi

సాక్షి, కడప : బాలల భవితవ్యం అగమ్యగోచరంగా మారుతోంది.  పుట్టిన క్షణంలో అన్నీ బాగున్నా...తర్వాత కాలంలో వారిలో మార్పు కనిపిస్తోంది. చిన్న వయస్సులోనే పెద్ద భారం..చెప్పుకోలేని బాధ వారికి గుదిబండగా మారుతోంది. కం ప్యూటర్‌ యుగం అభివృద్ధి్ద చెందుతున్నా బాలలను మాత్రం అంగవైకల్యం వెంటా డుతోంది.  ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం వెరసి చిన్నారుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతోంది. తల్లి గర్భిణిగా ఉన్నప్పుడే సరైన రీతిలో వారికి పౌష్టికాహారం సక్రమంగా అందించకపోవడంతో కడుపులో ఉన్న బిడ్డ ఏదో ఒక సమస్యతో పుడుతున్నారని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు.

చిన్నారులను చూస్తే అయ్యోపాపం అనక మానరు. ఎందుకంటే కళ్లు న్నా చిన్న వయస్సులోనే కనిపించక కొందరు...చేతులున్నా వంకర్లతో మరికొందరు....నడవడానికి కాళ్లు సహకరించక  ఇంకొందరు  నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రత్యేక చర్యలతో వీరికి కొంతైనా ఉపశమనం ఉండదా?యంత్రాంగం నడుం బిగిస్తే ఎంతోకొంత  సాధించడం కష్టమేమి కాదేమో? అయితే బాల్యంపై  వికలత్వం బళ్లెంలా మారడంతో వారి బతుకు అగమ్య గోచరంగా మారింది.  జిల్లాలో మానసిక రుగ్మతలతో బాధపడుతున్న చిన్నారులు అధిక సంఖ్యలో ఉన్నారు.

జిల్లా విద్యాశాఖ రికార్డుల్లో కొంతమేర రికార్డు చేసినా అనధికారికంగా అంతకు రెట్టింపు ఉంటారు. చిన్నారుల పరిస్థితి విషయంలో ప్రత్యేకంగా ప్రభుత్వం భవితకేంద్రాల ద్వారా వారిలో మార్పు తీసుకు వచ్చేందుకు ఫిజియోథెరఫి డాక్టర్లతోపాటు ఇతర టీచర్లను పెట్టి నడిపిస్తున్నారు. కంటికి సంబంధించి కూడా ప్రతి సంవత్సరం వైద్య కార్యక్రమాలు చేస్తున్నా ఏడాదికేడాదికి ఆ సంఖ్య తగ్గాల్సి ఉంటుది. అయితే    మానసిక వ్యాధుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. వీరికి అనేక ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నా  మార్పు రాకపోవడంతో ప్రతిక్షణం వారిని తలుచుకుని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

చిన్నారులను వేధిస్తున్న అనేక రకాల సమస్యలు
చిన్నారులను అనేక రకాల సమస్యలు వేధిస్తున్నా యి. మానసిక వికలాంగులుగా నరకయాతన అనుభవించే వారు సుమారు 1397మంది ఉండగా ...కంటిచూపు సమస్య ఉన్న వారు 1208 ...మూగవారు 510...వినికిడి లోపం సమస్యతో బాధపడేవారు 599..కాళ్లు చేతులు వంకర ఉన్న వారు 323..మానసిక రుగ్మతలతో బాధపడుతూ చదువులో వెనుకబడిన వారు 726 మంది కనిపిస్తున్నారు. విద్యాశాఖ రికార్డుల్లో అంతమేర కనిపిస్తు ్డన్నా.. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలుస్తోంది.

నలిగిపోతున్న బాల్యం
చిన్న వయస్సులోనే పాఠశాలకు వెళ్లాలంటే మారాం చేసే చిన్నారులకు ఆటపాటలు ఉన్నాయని....అందమైన ప్రపంచం ఉందని వారికి మంచి మాటలు చెప్పి చదువుల తల్లి ఒడికి చేరేలా చూస్తాం. కానీ అక్కడ చేరిన తర్వాత తరగతులు మారుతూ.. పెద్దవారు అయ్యేకొద్ది తల్లిదండ్రుల్లో ఆనందం కనిపిస్తోంది. కానీ ఆటపాటలు లేక  నలిగిపోతూ మానసిక ఆందోళనకు గురవుతున్నారు.  ఒత్తిడికి గురై తామేం చేస్తున్నామో మరిచిపోయి ప్రాణాలను తీసుకోవడానికి కూడా తెగిస్తున్నారు. కానీ బాల్యం మాత్రం భయపడుతూనే కాలం సాగిస్తోంది. చిన్నారులకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు