'సెప్టెంబర్‌ 5న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్'

13 Jul, 2014 13:34 IST|Sakshi
'సెప్టెంబర్‌ 5న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్'

హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎంసెట్ కౌన్సెలింగ్ పై తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వయంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రితో మాట్లాడానని తెలిపారు. సీఎం చంద్రబాబు కూడా కేసీఆర్‌కు లేఖ రాశారని చెప్పారు. అయినా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తక్షణం తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. కేంద్రాన్ని ఆశ్రయించడమా, కోర్టును ఆశ్రయించడమా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

సెప్టెంబర్‌ 5న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు  గంటా శ్రీనివాసరావు తెలిపారు. 10 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. టెట్ రద్దు చేసేందుకు న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వచ్చే ఏడాది నుంచి టెట్ రద్దు చేసే అవకాశముందన్నారు. రేషనలైజేషన్ కింద 10 వేల మంది ఉద్యోగులను బదిలీ చేస్తామని చెప్పారు. ఈ ఉదయం టెన్త్ అడ్వాన్స్ డ్ ఫలితాలను ఆదివారం ఆయన విడుదల చేశారు.

ఏపీ టెన్త్ అడ్వాన్స్ డ్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు