31 లోగా అడ్మిషన్ల ప్రక్రియను ముగించాలి: హైకోర్టు

26 Jul, 2013 13:11 IST|Sakshi
31 లోగా అడ్మిషన్ల ప్రక్రియను ముగించాలి: హైకోర్టు

హైదరాబాద్ : మేనేజ్మెంట్ మెడికల్ సీట్ల వ్యవహారంపై హైకోర్టు స్పందించింది. ఈనెల 31వ తేదీలోపు అడ్మిషన్ల ప్రక్రియను ముగించాలని న్యాయస్థానం ఆదేశించింది. నిన్నటి దరఖాస్తులను మేనేజ్మెంట్ కళాశాలలు హెల్త్ యూనివర్శిటీకి అందించాలని సూచించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అయ్యేలా చూడాలని హైకోర్టు కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది.

 ప్రైవేటు వైద్య కళాశాలలు యాజమాన్య కోటా సీ-కేటగిరీ కింద తమకు దరఖాస్తులను అందుబాటులో ఉంచడం లేదంటూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.  దరఖాస్తుల జారీకి సంబంధించి నిన్న అటు విద్యార్థులు, ఇటు వైద్య కళాశాలల యాజమాన్యాల వాదనలు విన్న హైకోర్టు తన నిర్ణయాన్ని ఈరోజు వెల్లడించింది.

కాగా....గ్రూప్‌ -1 పరీక్షా పత్రాల వివాదంపై కమిటీ వేయాలని హైకోర్టు సూచించింది. ఇందుకోసం యూపీఎస్సీ నిపుణుల సలహా తీసుకోవాలని, నెలరోజుల్లో నివేదిక సమర్పించాలని ఏపీపీఎస్సీకి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.

మరిన్ని వార్తలు