వైఎస్‌ వివేకా కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు

29 Mar, 2019 16:57 IST|Sakshi

సాక్షి, అమరావతి : మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏపీ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ హత్య ఘటనపై ఎవరు వ్యాఖ్యానించరాదని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున అండర్‌ టేకింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ)ను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరపున.. న్యాయవాదులు అండర్‌ టేకింగ్‌ ఇచ్చారు. అలాగే ఈ కేసుకు సంబంధించి పోలీసులు, సిట్‌ సైతం మీడియాకు వివరాలు అందించడానికి వీలు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 15వ తేదీకి వాయిదా వేసింది. చదవండి....(రాజకీయ లబ్ధికే బాబు నిందారోపణలు)

కాగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తుపై నమ్మకం లేదని వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ సౌభాగ్యమ్మ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిట్‌ పేరుతో వైఎస్‌ కుటుంబ సభ్యులపై బురద జల్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని న్యాయవాదులు కోర్టుకు వివ్నవించారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ అజమాయిషీలో లేని దర్యాప్తు సంస్థకు కేసు విచారణ అప్పగించాలని కోరిన విషయం తెలిసిందే. చదవండి....(వైఎస్‌ వివేకా హత్య కేసులో వింత పోకడ)

మరిన్ని వార్తలు...
నారాసురుడి నలభై ఏళ్ల రక్త చరిత్ర..!
ఓటమి భయంతో మహాకుట్ర
బాబు స్టేట్‌మెంట్‌కు అనుగుణంగానే..
హత్య చేయించి.. అసత్యాలు వల్లించి..

మరిన్ని వార్తలు