జైల్లో ఎయిడ్స్‌ ఖైదీల కేసుపై విచారణ వాయిదా

2 Aug, 2019 12:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఎయిడ్స్‌ ఖైదీలపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు శుక్రవారం అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో 27మందికి ఎయిడ్స్‌ ఉందో, లేదో అధికారులు నిర్థారించాలని హైకోర్టు ఆదేశాలతో జైలు అధికారులలో హైరానా మొదలైంది. హెచ్‌ఐవీ రోగుల పరిస్థితిపై సీరియస్‌ అయిన హైకోర్టు 27మందికి రోగ నిర్థారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది. ఏడు కొండలు అనే ఖైదీ తాను హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుడనని, తనకు బెయిల్‌ ఇస్తే ఇంటి వద్ద కొన్ని రోజులు వైద్యం చేయించుకుంటానని హైకోర్టుకు విన్నవించుకోవడంతో న్యాయస్థానం ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

కాగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీలు, రిమాండ్‌ ఖైదీలు కలిపి మొత్తం 1400మంది ఉన్నారు. 1200మందికి పరిమితి ఉన్న జైలులో అదనంగా 200 మంది ఖైదీలు ఉన్నారు. దీంతో జైలులో ఆస్పత్రి సౌకర్యాలు అంతంత మాత్రమే. జైలులో ముగ్గురు డాక్టర్లు ఉన్నా రాత్రి వేళల్లో ఏ ఒక్క డాక్టరూ అందుబాటులో ఉండటం లేదని ఖైదీలు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు