జులై 1న కొత్త అంబులెన్స్​లు ప్రారంభం

30 Jun, 2020 10:42 IST|Sakshi

ట్వీట్​ చేసిన రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్ రెడ్డి నాయకత్వంలో పేదల చెంతకే వైద్యం అందబోతోందని, మరోసారి ఆంధ్రప్రజలు వైఎస్​ రాజశేఖర్ రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారని వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి మంగళవారం ట్వీట్​ చేశారు. (పక్కాగా పోలవరం లెక్కలు)

ప్రజారోగ్యం పట్ల సీఎం వైఎస్​ జగన్​ తపనకు కార్యరూపంగా సరికొత్త హంగులతో 108, 104 వాహనాలు బుధవారం (జులై 1) నుంచి అందుబాటులోకి రాబోతున్నాయని పేర్కొన్నారు. 203 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అంబులెన్సులు, మొబైల్​ క్లినిక్స్​లో వెంటీలేటర్లు, ఈసీజీ, లైఫ్ సపోర్టు వ్యవస్థలో అందుబాటులో ఉంటుందని చెప్పారు.(రూ.10,974 కోట్లతో గ్రామాల్లో జలజీవన్)

వైఎస్​ జగన్​ రాష్ట్రంలో సర్కారీ వైద్య విప్లవాన్ని తీసుకొచ్చారని మరో ట్వీట్​లో విజయసాయి రెడ్డి కొనియాడారు. ఎన్నడూ లేని విధంగా కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. మాజీ సీఎం వైఎస్​ రాజశేఖర్ రెడ్డి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని తీర్మానించారని వివరించారు. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రులు ప్రైవేటును మాత్రమే ప్రోత్సహించారన్నారు. వైఎస్​ జగన్​ ప్రభుత్వం పెద్దాయన కలలను సాకారం చేస్తోందని పేర్కొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు