ఏపీ లాసెట్‌-2017 నోటిఫికేషన్‌ విడుదల

13 Feb, 2017 20:47 IST|Sakshi
ఏపీ లాసెట్‌-2017 నోటిఫికేషన్‌ విడుదల

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లాసెట్‌–2017 నోటిఫికేషన్‌ విడుదలయింది. మూడేళ్లు-ఐదేళ‍్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు యూనివర్శిటీ వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 18 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 18. అపరాధ రుసుము రూ.500తో మార్చి 27 వరకు, రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 5 వరకు, రూ.1500తో ఏప్రిల్‌ 14 వరకు, రూ.5 వేలతో ఏప్రిల్‌ 17 (సాయంత్రం 5 గంటల వరకు) వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్ష ఫీజు రూ.700, ఎల్‌ఎల్‌ఎంకు రూ.800గా నిర్ధారించారు. హాల్‌టికెట్లు ఏప్రిల్‌ 14 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 19న రాత పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా