సెప్టెంబర్ 6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

21 Aug, 2016 01:08 IST|Sakshi
సెప్టెంబర్ 6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

సాక్షి, అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాలను సెప్టెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకూ నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో ప్రధానంగా జీఎస్‌టీ బిల్లు ఆమోదంతోపాటు ఇతర అంశాలను చర్చించనున్నారు. విజయవాడలో శనివారం ఏపీ సీఎం చద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఇక నుంచి తాను ఈ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యతనిస్తానని, పరిపాలనలో ఐఓటీని ఉపయోగిస్తానని, డ్రోన్‌ల ద్వారా ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటానని సీఎం చెప్పారు. మంత్రులు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని, శాఖలు, సమస్యలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

>
మరిన్ని వార్తలు