శాసనసభ బీఏసీ సమావేశం రేపటికి వాయిదా

9 Dec, 2019 15:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ అధ్యక్షతన సోమవారం శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. వారం రోజులు పాటు శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో తీర్మానం చేశారు. ఈనెల 9, 10, 11, 12, 13, 16, 17 తేదీలలో ఏడు పని దినాల్లో మండలి సమావేశాలు నిర్వహించాలని ఈ మేరకు బీఏసీ నిర్ణయం తీసుకొంది. డిసెంబర్‌ 14, 15 తేదీలు శని, ఆదివారాలు కావడంతో సభకు సెలవు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సమావేశమైన బీఏసీ తదుపరి సమావేశాన్ని రేపటికి వాయిదా వేసింది. సమావేశానికి శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు  హాజరయ్యారు.

మరిన్ని వార్తలు