‘అలా చేస్తే నవరత్నాలకు ఆర్ధిక భారం తగ్గుతుంది’

20 Oct, 2019 15:29 IST|Sakshi

సాక్షి, విజయవాడ : చిత్తూరులోని కల్కి భగవాన్‌ ఆశ్రమాలపై ఐటీ దాడులను స్వాగతిస్తున్నామని ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నార్ని వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఏపీ మూఢనమ్మకాల నిర్మూలనా చట్ట సాధన కమిటీ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పుట్టపర్తి సాయిబాబ, కర్నూలు బాల సాయిబాబ ఆశ్రమాలపై కూడా ఇలాంటి దాడులు చేయించాలని సీఎంను కోరుతున్నామన్నారు. ఇటువంటి దాడుల వల్ల జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలకు ఆర్ధికంగా భారం తగ్గుతుందని సూచించారు. ఆధునిక కాలంలో కూడా ప్రజలు మూఢనమ్మకాలను నమ్ముతున్నారని, ప్రకాశం, విశాఖ, తెలంగాణలలో జరిగిన ఉదంతాలే ఇందుకు నిదర్శమన్నారు. సమాజంలోని దొంగబాబాలను అరెస్ట్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో 51a ఆర్టికల్‌లో అశాస్త్రీయ విధానాలను ప్రశ్నించాలని స్పష్టంగా ఉందంటూ.. ఏపీలో మూఢనమ్మకాల నిర్మూలనా చట్టం తీసుకురావాలని వెంకట సుబ్బయ్య డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు