మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయాలి

9 Jul, 2020 18:57 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ గురువారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను కలిశారు. మహిళా కమిషన్‌ దృష్టికి వచ్చిన కేసుల వివరాలను డీజీపీకి తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న కేసులపై డీజీపీతో చర్చించినట్టు చెప్పారు. గుంటూరులో నగ్న వీడియోల కేసు మరవకముందే మరో కేసు నమోదు అయిందన్నారు. కేసులకు సంబంధించి పోలీసుల పాత్రపై విచారించి చర్యలు తీసుకోమని డీజీపీని కోరినట్టు వెల్లడించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. (‘నాడు – నేడు’పై మన కల నిజం కావాలి: సీఎం జగన్‌)

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చినట్టు తెలిపారు. దిశా యాప్‌ను మహిళలు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. మహిళా ఉద్యోగులపై దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. సైబర్‌ నేరాలకు పాల్పడేవారిపై మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు.(‘కరోనా బాధితులకు ప్రైవేటు చికిత్స అందించేందుకు సిద్ధం’)


 

మరిన్ని వార్తలు