కరోనా బాధితుడు కోలుకుంటున్నారు..

14 Mar, 2020 10:11 IST|Sakshi

కరోనా వైరస్‌ నిరోధక చర్యలపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల

వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దు

మాస్క్‌లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాం..

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దని.. వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ నిరోధక చర్యలపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ బాధితుడు కోలుకుంటున్నారని పేర్కొన్నారు. 14 రోజుల తర్వాత మళ్లీ శాంపిల్‌ను పరీక్షించి డిశ్చార్జ్‌ చేస్తామన్నారు. కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి ఏపీకి వచ్చిన 675 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారని తెలిపారు. 428 మంది  ఇళ్లల్లోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని పేర్కొన్నారు. 233 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని తెలిపారు.ఆసుపత్రిలో 14 మంది చికిత్స పొందుతున్నారన్నారు. (కరోనా ఎఫెక్ట్‌: అమెరికాలో నేషనల్‌ ఎమర్జెన్సీ)

52 మందికి నెగిటివ్‌..
61 మంది శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా 52 మందికి నెగిటివ్‌ అని తేలిందని.. 8 మంది శాంపిల్స్‌ సంబంధించిన రిపోర్టులు రావాల్సిఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా పెట్టామని తెలిపారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో 8,691 మంది ప్రయాణికుల్ని  స్క్రీనింగ్ చేశామని.. వీరిలో 64 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నం,గన్నవరం, క్రిష్ణపట్నం ఓడరేవుల్లో  ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేశామని వీరిలో ఒక్కరికి కూడా వ్యాధి లక్షణాలు లేవని తెలిపారు. (కరోనా పరీక్ష చేయించుకుని రండి..)

కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు వ్యాధి లక్షణాలు ఉన్నా.. లేకపోయినా ఇళ్లలోనే ఉండాలని..బయటకు వెళ్లకూడదని సూచించారు. కుటుంబసభ్యులు, ఇతరలతో కలవకూడదని తెలిపారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్‌ను ధరించి  108 వాహనంలోనే  సమీప ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని జవహర్‌రెడ్డి సూచించారు. అన్ని జిల్లాలో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశాం.పూర్తి స్థాయిలో మాస్క్‌లు అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని కోరారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని తెలిపారు (కోడిని తింటే ‘కోవిడ్‌’ రాదు..)

మరిన్ని వార్తలు