టీడీపీ గ్లోబల్‌ ప్రచారం సిగ్గుచేటు..

3 Mar, 2020 10:32 IST|Sakshi
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

సాక్షి, విజయవాడ: బీసీలను టీడీపీ ఓటుబ్యాంకుగానే చూసిందని.. వారి అభివృద్ధికి పాటు పడలేదని దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బీసీల ఎదుగుదలను ఓర్చుకోలేక నారా లోకేష్ అనుచరులు అడ్డుపడటమే అందుకు నిదర్శనమని ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజుకో వార్డులో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిపెడుతున్నారు. మంగళవారం 26వ డివిజన్‌లో మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించిన మంత్రి.. సమస్యలపై ఆరాతీసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో సీఎం వైఎస్ జగన్ కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను హెచ్చరించారు. (చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం..)

టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డుపడ్డారు..
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే ప్రతిపక్ష టీడీపీ మోకాలడ్డే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలని సీఎం భావిస్తే టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డు పడ్డారని ఆరోపించారు. బీసీల పై టీడీపీ కి ఉన్న ప్రేమ ఏపాటిదో బట్టబయలు అయిందని చెప్పారు. (బడుగుల ద్రోహి చంద్రబాబు)

ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప టీడీపీ కి ప్రజా సంక్షేమం అవసరం లేదన్న విషయం తేటతెల్లం అవుతోందంటున్నారు. టీడీపీ హయాంలో 44 నాలుగు లక్షల మందికి పెన్షన్ లు ఇస్తే సీఎం జగన్ 60 లక్షల మందికి అందిస్తున్నారని పేర్కొన్నారు. పదహారు లక్షల మందికి కొత్తగా పెన్షన్ లు ఇస్తుంటే ఉన్నవి తొలగిస్తున్నారంటూ టీడీపీ నేతలు గ్లోబల్ ప్రచారం చేయటం సిగ్గుచేటని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు