బక్రీద్‌ శాంతి సుహృద్భావాలను పెంపొందించాలి

12 Aug, 2019 12:35 IST|Sakshi

ముస్లిం సోదరులకు మంత్రులు శుభాకాంక్షలు

సాక్షి, గుడివాడ: త్యాగం, సహనానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్‌ పర్వదినం ప్రజలందరి మధ్య శాంతి సుహృద్భావాలను పెంపొందించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. సోమవారం బక్రీద్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈర్ష్య, అసూయా ద్వేషాలకు అతీతంగా త్యాగమయ సమాజ నిర్మాణానికి బాటలు వేయాలని కోరారు.

మానవత్వానికి, తాగ్యానికి పత్రీక:
ముస్లిం సోదరులకి రవాణా,సమాచార శాఖ మంత్రి పేర్ని నాని బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ పండగను మానవత్వానికి, త్యాగానికి పత్రీకగా పేర్కొన్నారు

విజయవాడలో ఘనంగా బక్రీద్ వేడుకలు: 
ఈద్గాల వద్ద ముస్లింలు  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో  సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఆత్మీయ ఆలింగనాలతో ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. ముస్లింలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ముస్లింలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు