‘అనాలోచిత నిర్ణయాలతోనే వరద ముప్పు’

7 Aug, 2019 14:35 IST|Sakshi
వరద బాధితులతో మాట్లాడుతున్న మంత్రులు

సాక్షి, దేవీపట్నం : తూర్పుగోదావరి ఏజెన్సీలోని పోచమ్మ గండి, దేవీపట్నం మండలం ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, పినిపే విశ్వరూప్‌, ఎమ్మెల్యేలు బాలరాజు, రాజా, ధనలక్ష్మి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పబ్లిసిటీకి చేసిన ఖర్చు నిర్వాసితుల పునరావాసానికి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. సోమవారం పోలవరం అంటూ ప్రచారానికే ప్రాధాన్యమిచ్చిన చంద్రబాబు నిర్వాసితుల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. అనాలోచితంగా కాపర్ డ్యాం నిర్మించడం వల్లే  దేవిపట్నం మండలంతో సహా అనేక ప్రాంతాలకు వరద ముప్పు ఏర్పడిందన్నారు.

మరిన్ని వార్తలు