మెడికల్‌ కాలేజీల స్థలాలను పరిశీలించిన మంత్రులు

3 Jun, 2020 12:53 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: మెడికల్‌ కళాశాల స్థలాలను బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని.. మంత్రులు అవంతి శ్రీనివాస్‌, ధర్మాన కృష్ణదాస్‌, అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే ఫల్గుణ, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలతో కలిసి పరిశీలించారు. పర్యటనలో భాగంగా త్వరలో నిర్వహించే మెడికల్‌ కాలేజీ నమూనాలను పరిశీలించిన మంత్రి ఆళ్ల నాని అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రుల బృందం పాడేరులో వైద్యాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఆళ్ల నాని మట్లాడుతూ.. టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి 35 ఎకరాలు మెడికల్‌ కాలేజీ కోసం కేటాయించాం. పాడేరు మెడికల్‌ కాలేజ్‌ నిర్మాణ పనులకు ఆగస్టులో టెండర్లు పిలుస్తాం. పాడేరు మెడికల్‌ కాలేజీ ఆవరణలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేస్తాం. అన్ని పనులు అత్యంత త్వరితగతిన పూర్తి చేసి మెడికల్‌ తరగతులు ప్రారంభం అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.చదవండి: ఈ నెల 11న ఏపీ కేబినెట్‌ సమావేశం 

మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. 'సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్ని వర్గాల అభిమాని. అదనంగా గిరిజనుల పక్షపాతి. గిరిజనుల ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా సీఎం శ్రద్ధ వహిస్తున్నారు. త్వరలో ఈ ప్రాంతంలో మెడికల్‌ కాలేజీ నిర్మాణంతో గిరిజనుల జీవితాలు మారనున్నాయని' అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. కాగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంలో తొలిసారిగా మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గత ఏడాది నిర్ణయించారు. అందులో భాగంగానే పాడేరు, అనకాపల్లి ప్రాంతాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే.. పాడేరులో మెడికల్‌ కాలేజీ కోసం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల పక్కనున్న 35 ఎకరాల భూమిని గుర్తించి ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులు స్వాధీనం చేశారు. ఈ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్‌ఎస్‌వై కింద రూ.195 కోట్లను తన వాటాగా మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనకాపల్లి మెడికల్‌ కాలేజీ కోసం అనకాపల్లి మండలం గొలగాం, కోడూరు, పిసినికాడ గ్రామాల్లో ఖాళీ స్థలాలను ప్రాథమికంగా గుర్తించారు. చదవండి: పెనుముప్పుగా నిబంధనల ఉల్లంఘన..!

మరిన్ని వార్తలు