ఏపీ పాలిసెట్-2016 ప్రవేశ పరీక్ష ‘కీ’ విడుదల

3 May, 2016 01:36 IST|Sakshi

విజయవాడ (మొగల్రాజపురం): రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 27న నిర్వహించిన పాలిసెట్-2016 పరీక్ష ‘కీ’ని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి ఎ.నిర్మల్‌కుమార్ సోమవారం విడుదల చేశారు. ఫలితాలను ఈ నెల 7వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు. జూన్ మొదటి వారంలో కౌన్సెలింగ్ జరుగుతుందని వివరించారు. ‘కీ’ని https://polycetap. nic.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 333 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 1,32,385 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా