ఏపీ పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

14 May, 2019 18:38 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ పీజీ ఈసెట్‌-2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు విడుదల చేశారు. ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 24,248మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫలితాల్లో 20,986 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ నెల 20 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని విజయరాజు తెలిపారు. 12 ఇంజినీరింగ్‌ పీజీ కోర్సులు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలోనే కౌన్సెలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలో వివిద కాలేజీలలో ఉన్న 21,941 ఎంటెక్‌, 5495 ఎంఫార్మసీ సీట్లను మెరిట్‌ ప్రకారం కేటాయించనున్నారు.

సబ్జెక్టుల వారిగా మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు

బయోటెక్ - పి.షామారజిత, ఈస్ట్ గోదావరి
కెమికల్ ఇంజనీరింగ్ - ఏ వేదశ్రీ, నెల్లూరు జిల్లా
సివిల్ ఇంజనీరింగ్‌ - మహంతి అంజనీబాయ్, గుంటూరు
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ - కెహెచ్ఎన్ సీతారాగిని, గుంటూరు
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - ఎం.జ్యోష్న, కడప
ఎలక్ట్రానిక్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్ - టి.మహేంద్ర, ప్రకాశం
ఫుడ్ టెక్నాలజీ - పి.రవళి, వెస్ట్ గోదావరి
జియో ఇంజనీరింగ్ ‌- ఎ.రవితేజ, కృష్ణా
ఇనుస్టుమెంటేషన్ ఇంజనీరింగ్ - ఎస్ఎన్.సింధూరీ, కృష్ణా
మెకానికల్ ఇంజనీరింగ్ - ఎ.సాయిచరణ్, కర్నూలు
మెటాలజికల్ ఇంజనీరింగ్ - ఎ.సాయిప్రకాష్, వెస్ట్ గోదావరి
నానో టెక్నాలజీ - పి.మంత్రునాయక్, ప్రకాశం
ఫార్మసీ - పి.పృధ్వీ, కృష్ణా

మరిన్ని వార్తలు