9 అవార్డులతో టాప్‌లో నిలిచిన‌ ఏపీ పోలీస్ శాఖ

30 Nov, 2019 16:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప‌ద‌వీ బాధ్యత‌లు స్వీక‌రించిన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దేశంలోనే తొలిసారిగా పోలీస్ శాఖ‌లో ప్రవేశ పెట్టిన వీక్లీ ఆఫ్ విధానానికి `స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్` అవార్డు ల‌భించింది. అంతేగాక.. వేర్వేరు విభాగాల్లో ఏపీ పోలీస్ శాఖకు 9 స్కాచ్ అవార్డులతో పాటు దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఢిల్లీలోని కాన్‌స్టిస్ట్యూష‌న్ క్లబ్‌లో జ‌రిగిన స్కాచ్ స‌మ్మిట్‌లో ఈ `స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్` అవార్డుల‌ను సంబంధిత విభాగాల‌కు చెందిన పోలీస్ అధికారులు అందుకున్నారు. అవార్డు ఎంపికలో భాగంగా వీక్లీ ఆఫ్ విధానంపై జరిగిన ఆన్‌లైన్ ఓటింగ్ కు అనూహ్య స్పంద‌న ల‌భించింది. దేశంలోనే తొలిసారిగా పోలీస్ శాఖ‌లో వీక్లీ ఆఫ్ విధానం ప్రవేశ‌పెట్టడంతోపాటు పూర్తిగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డుల‌కెక్కింది.

శ‌నివారం నాటికి ఆరు నెల‌ల పాల‌న పూర్తి చేసుకున్న సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఇదే రోజున ఈ శుభ‌వార్త అంద‌డం ప‌ట్ల పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీక్లీ ఆఫ్ తోపాటు ఉమెన్ జువైన‌ల్ వింగ్‌, ఫేస్ ట్రాక‌ర్‌, ప్రేర‌ణ‌, స్ఫూర్తి, ఇంటిగ్రేటెడ్ స‌ర్వైలెన్స్ అండ్ రీసెర్చ్ సెంట‌ర్‌, జూనియ‌ర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస‌ర్స్‌, ట్రాన్స్‌ఫ‌ర్ మేనేజ్‌మెంట్ సిస్టం, విజిట‌ర్ మోనిట‌ర్ సిస్టం త‌దిత‌ర విభాగాల‌కు కూడా `స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్` అవార్డులు ల‌భించాయి. అవార్డుల‌ను ఆయా విభాగాల‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారులు అందుకున్నారు. అవార్డులు అందుకున్న పోలీసుల‌ను ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ అభినందించారు. కార్యక్రమంలో డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌తో పాటు విశాఖప‌ట్నం క‌మిష‌న‌ర్ ఆర్‌కే మీనా, వివిధ జిల్లాల ఎస్పీలు, క‌మిష‌న‌ర్లు, ఇత‌ర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా..

మరిన్ని వార్తలు