‘చిన్నారుల చేతుల్లో మట్టి గణేశుడు’

31 Aug, 2019 14:58 IST|Sakshi

సాక్షి, విజయవాడ : పర్యావరణ హిత వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణకు అందరూ తోడ్పడాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ ఎస్‌ఎస్ ప్రసాద్‌ అన్నారు. విజయవాడలోని మెఘల్‌ రాజపురం సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో ‘చిన్నారుల చేతుల్లో మట్టి గణేశుడు’ శిక్షణా శిబిరం కార్యక్రమాన్నిశనివారం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ ఎస్‌ఎస్ ప్రసాద్‌, బోర్డు కార్యదర్శి వివేక్‌ యాదవ్‌ హజరయ్యారు.

ఈ సందర్భంగా చైర్మన్‌ ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ...రసాయన రంగులతో కూడిన గణపతి విగ్రహాలు వినియోగించడం వల్ల పర్యావరణానికి హానికరం అన్నారు. విగ్రహాల తయారిలో రసాయన రంగులను వాడి మంచి నీటి జలాశయాలను కలుషితం చెయవద్దని విఙ్ఞప్తి చేశారు. రంగు రంగుల పెద్ద విగ్రహాలను వాడి నిమజ్జనం చేసి కాలుష్యానికి కారకులు కాకుండా, మట్టి విగ్రహాలను వాడాలని సూచించారు. అదే విధంగా  నిమజ్జనానికి ముందు ప్లాస్టిక్‌, ఇతర కరగని ఆభరణాలను తొలగించాలని పేర్కొన్నారు. బోర్టు సెక్రెటరీ వివేక్‌ యాదవ్‌ మాట్లాడుతూ..చిన్నపిల్లలకు కాలుష్యంపై అవగాహన కల్పించడానికి ‘చిన్నారుల చేతుల్లో మట్టి గణేశుడు’ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. భావి తరాల బంగారు భవిత వీరిదే కాబట్టి మట్టి వినాయకుల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు