ఏపీ సచివాలయానికి సంక్రాంతి శోభ 

9 Jan, 2020 17:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: సంక్రాంతి విశిష్టత తెలిపే రంగుల రంగుల రంగవల్లులు, హరిదాసుల సంకీర్తనలు, డూడూ బసవన్నల నృత్యాలు, కోలాటాలతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా గురువారం ఏపీ సచివాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంక్రాంతి వేడుకల్లో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు.. సచివాలయానికి మరింత సంక్రాంతి శోభను తెచ్చాయి. ఈ ముగ్గుల పోటీల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఘనంగా సంబరాలు జరుపుకున్నామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. కొత్త ప్రభుత్వంలో కొత్త ఉత్సాహంతో ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలకు అనుగుణంగా ఉద్యోగులంతా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతి ముందుగానే వచ్చిందని.. ఉద్యోగులంతా చాలా సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు