కాలినడకన తిరుమలకు చేరుకున్న మంత్రి

14 Nov, 2019 20:11 IST|Sakshi

సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం నుంచి కుటుంబసమేతంగా ఆయన కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే కాలినడకన తిరుమలకు వస్తానని మొక్కుకున్నానని, జగన్‌ సీఎం కావడంతో ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చానని మంత్రి తెలిపారు. కాగా, శుక్రవారం ఉదయం స్వామివారిని మంత్రి నాని కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా