నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

17 May, 2019 13:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అధికారులు శుక్రవారం రవాణ శాఖ కార్యాలయంలో రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరు కావాలంటూ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ట్రావేల్స్‌ యజమానులు ఈ ఆదేశాలను బేఖాతరు చేసి ఆలస్యంగా సదస్సుకు హాజరయ్యారు. దాంతో డీటీసీ వచ్చినప్పటికి కూడా ట్రావెల్స్‌ యజమానులు రాకపోయేసరికి సదస్సు ఆలస్యంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా మీరా ప్రసాద్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నిబంధనలు తూచా తప్పక పాటించాలన్నారు. బస్సు ప్రారంభానికి ముందే డ్రైవర్‌కి బ్రీత్‌ ఎనలైజర్‌తో చెక్‌ చేయాలని తెలిపారు. మద్యం సేవించి బస్సు నడిపితే జైలు, జరిమానాతో పాటు లైసెన్స్‌ కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. స్పీడ్‌ లాక్‌ను ఎవరైనా ట్యాపర్‌ చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కల్గిస్తే పర్మిట్‌ రద్దు చేసి.. బస్సు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ సదస్సుకు హాజరుకానీ యాజమాన్యాలకు నోటీసులు పంపిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు