కొలిక్కి వచ్చిన  మెరిట్‌ జాబితా..!

24 Sep, 2019 10:18 IST|Sakshi

గ్రేడ్‌–1 మినహా మిగతా పోస్టులకు సిద్ధమైన జాబితా

∙కొన్నింటిని ఆమోదించిన కలెక్టర్‌

వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్న అధికారులు

సాక్షి, విజయనగరం :  గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థుల మెరిట్‌ జాబితా ఓ కొలిక్కి వచ్చింది. గ్రేడ్‌–1 మినహా మిగతా పోస్టులకు సంబంధించి సిద్ధమైన మెరిట్‌ జాబితాను కలెక్టర్‌ ఆమోదం పొందాక వెబ్‌సైట్‌లో పెడుతున్నట్టు జెడ్పీ సీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. మెరిట్‌ జాబితా ను రూపొందించేందుకు మూడు రోజులుగా కసరత్తు చేస్తున్నాం.. రోస్టర్, రూల్‌ఆఫ్‌ రిజర్వేషన్లకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో పారదర్శకంగా జాబితాను రూపొందిస్తున్నాం.. దీంతో అనుకున్న సమయం కంటే సమయం ఎక్కువుగా పడుతున్నట్టు చెబుతున్నారు.

గ్రేడ్‌–1 పోస్టులు మినఘా అగ్రికల్చర్‌ అసిస్టెంట్, ఫిషరీస్‌ అసిస్టెంట్, హార్టికల్చరల్‌ అసిస్టెంట్, ఏఎన్‌ఎం తదితర పోస్టులన్నింటికి సంబంధించిన మెరిట్‌ జాబితా సిద్ధమైంది. వెబ్‌ సైట్‌లో పెట్టాక మెరిట్‌ జాబితాలో ఉన్న వారికి ఆయా శాఖాల నుంచి కాల్‌ లెటర్లు సోమవారం రాత్రి నుంచే పంపిస్తున్నట్టు తెలిపారు. కాల్‌ లెటర్లు పంపించిన అభ్యర్థులకు ఇచ్చిన సమ యం ప్రకారం ధ్రువపత్రాలు పరిశీలన ఉంటుం దన్నారు. కొందరి ధ్రువపత్రాలను నేడు (మంగళవారం) పరిశీలించే అవకాశం ఉందన్నారు.

అభ్యర్థుల ఎదురుచూపు... 
సోమవారం మెరిట్‌ జాబితా వెల్లడిస్తామని అధికారులు చెప్పడంతో ఉదయం నుంచి  కొంతమంది జిల్లా పరిషత్‌ కార్యాలయానికి హడవుడిగా తిరిగారు. రాత్రి వరకు కార్యాలయాల పరిసరాల్లోనే గడిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా