సీపీఎస్‌ రద్దు చేయాలి...

21 Nov, 2018 07:19 IST|Sakshi
జగన్‌ను కలిసిన సీపీఎస్‌ ఉద్యోగులు

విజయనగరం :2004 సెప్టెంబర్‌ తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ సీపీఎస్‌ విధానం ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ విధానం ద్వారా పది శాతం బేసిక్‌ మరియు డీఏలతో పాటు ప్రభుత్వం ఇస్తున్న మ్యాచింగ్‌ గ్రాంట్‌ను కూడా ఆ ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ అకౌంట్‌కు ఎలాంటి భద్రత లేదు. షేర్‌ మార్కెట్‌ షరతులకు లోబడి ఈ ఖాతా నిర్వహణ జరుగుతుంది. ఈ విధంగా ప్రతీ ఏడాది ఎన్‌ఎస్‌డీఎల్‌కు సుమారు 800 కోట్లకు పైగా మ్యాచింగ్‌ గ్రాంట్‌ వేస్తున్నారు. ఈ విధానం ఇటు ఉద్యోగికి, అటు ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం లేదు. కేవలం, కార్పొరేట్‌ శక్తులకు ధారబోసే విధంగా ఉంది. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగ ఉపాధ్యాయులకు భద్రతను కల్పించాలి.              –ఎం.సీతన్న, నిమ్మక మాధవరావు,    ఆర్‌.రమేష్, పత్తిక చంద్రమోహన్, సీపీఎస్‌ ఉద్యోగులు

మరిన్ని వార్తలు