అశోక్‌బాబుపై ఏపీఎన్జీవో ఫైర్‌..

20 Jun, 2020 17:09 IST|Sakshi

మరోసారి ఏపీఎన్జీవో  పేరు ఎత్తితే సహించం

ఏపీఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: తాము ఎప్పుడు టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదని.. అశోక్‌బాబు చెప్పేవన్నీ అవాస్తవాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అశోక్‌బాబు తనను ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా కాకుండా అడ్డుకోవాలని చూశారని, చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవారిని ఏపీఎన్జీవో  అధ్యక్షుడిగా చేయాలని చూశారని ధ్వజమెత్తారు. ‘‘అశోక్‌బాబు మమ్మల్ని రాజకీయంగా వేధించారు. ఇంకోసారి ఆయన ఏపీఎన్జీవో  పేరు ఎత్తితే సహించేదిలేదని’’ చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. ఏపీఎన్జీవో సంఘానికి అశోక్‌బాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. (చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం నోటీసులు)
 
ఉద్యోగుల హక్కులను తాకట్టు పెట్టిన ఘనుడు
టీడీపీకి మద్దతు తెలిపామని అశోక్‌బాబు మాట్లాడటం సిగ్గుచేటని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. అశోక్‌బాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టిన ఘనుడు అశోక్‌బాబు అని, వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఒక మాటైనా మాట్లాడావా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఉద్యోగుల హక్కులను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని అశోక్‌బాబుపై బొప్పరాజు నిప్పులు చెరిగారు. (‘టీడీపీకి మిగిలింది ఆ ఒక్కటే’)

ఉద్యోగాన్ని అడ్డంపెట్టుకుని ఎమ్మెల్సీ పదవి..
గత ఎన్నికల్లో టీడీపీకి సహకరించానని స్వయంగా అశోక్‌బాబే ఒప్పుకున్నారని, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ పదవిని అశోక్ బాబు సంపాదించారని,  వెంటనే ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అశోక్ బాబు పై రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైనతే హైకోర్టు ను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా అశోక్ బాబు కు వచ్చిన నిధులుపైన కూడా విచారణ జరపాలని సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు