అపోలో షుగర్ క్లినిక్‌లు

1 Oct, 2014 00:35 IST|Sakshi

మధుమేహ బాధితుల కోసం ఏర్పాటు
అపోలో హాస్పిటల్స్ {Vూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి

 
న్యూఢిల్లీ: మధుమేహ బాధితులకు ఇతర వ్యాధులు రాకుండా నియంత్రించేందుకు షుగర్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. మధుమేహం ప్రభావంతో ఇతర వ్యాధులు సోకకుండా బాధితులను సంరక్షిస్తామన్నారు. డయాబెటీస్ తల నుంచి పాదాల వరకు.. గుండె, మెదడు, కిడ్నీ ఇలా శరీరంలోని ప్రతీ అవయవంపై ప్రభావాన్ని చూపుతుందన్నారు. అపోలో హాస్పిటల్స్, సనోఫి సంస్థ, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ దీపక్ చోప్రా సహకారంతో అపోలో షుగర్స్ క్లినిక్ ఆధ్వర్యంలో   ‘డిసీజ్ ఫ్రీ ఫర్ డయాబెటీస్’ కార్యక్రమాన్ని మంగళవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ.. డయాబెటిస్, గుండె, కేన్సర్, ఇన్ఫెక్షన్లతో ఏటా కోట్ల మంది మృత్యువాత పడుతున్నారని చెప్పారు. కేవలం ఇన్సులిన్, మందులే కాకుండా జీవనశైలి, ఆహార నియమాలు, యోగా, ధ్యానం కూడా షుగర్ నియంత్రణకు సహకరిస్తుందన్నారు. తొలి దశలో 50 అపోలో షుగర్ క్లినిక్‌లను అక్టోబరు 30వతేదీ లోపు ఏర్పాటు చేస్తామన్నారు. క్లినిక్‌ల ద్వారా డయాబెటిక్ నిపుణులు సూచనలు, సలహాలతోపాటు ఆహార నియమాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.

వైజాగ్, విజయవాడలో సుగర్ క్లినిక్‌లు...

 వైజాగ్, విజయవాడలో అపోలో షుగర్ క్లినిక్స్‌ను నెలకొల్పనున్నట్లు ఆపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సంగీతారెడ్డి చెప్పారు. మధుమేహం ఉన్నా ఇబ్బంది లేకుండా సాధారణ జీవితాన్ని గడిపేందుకు అపోలో షుగర్ క్లినిక్ దోహదపడుతుందన్నారు. జీవన శైలి, నియమిత ఆహారం, వ్యాయామం, ధ్యానం, సరైన మందులతో హెచ్‌బీఏ 1సీ  పరీక్ష ద్వారా 90 రోజుల్లో సాధారణస్థితికి వచ్చేలా సమగ్ర షుగర్ ప్యాకేజీని తయారు చేశామన్నారు.
 
 

మరిన్ని వార్తలు