ఆ భూములు అప్పన్నవే..

10 Jul, 2015 00:32 IST|Sakshi

జీవో నం.237ను రద్దు చేసిన ప్రభుత్వం
144.75 ఎకరాల వివాదంపై నిర్ణయం

 
విశాఖపట్నం : సింహాచలం దేవస్థానం భూములపై మూడు దశాబ్దాలుగా నలుగుతున్న వివాదంపై ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. 144.75 ఎకరాల భూసేకరణకు సంబంధించి 1990లో జారీ చేసిన జీవో (నెం.237)ను రద్దు చేసింది. సింహాచలం దేవస్థానానికి చెందిన వేపగుంటలోని 144.75 ఎకరాల భూమిని 1982లో భూసేకరణకు వుడా నోటిఫై చేసింది. ఈ నిర్ణయంపై కొంతమంది రైతులు ఆ భూమి తమదంటూ కోర్టుకెళ్లారు.

ఈ మేరకు భూసేకరణ అధికారి రూ.32,47,057లను సివిల్ కోర్టులో జమ చేశారు. ఈ నేపథ్యంలో ఆ భూమిని 1ః2 నిష్పత్తిలో దేవస్థానం, రైతులు పంచుకోవాలంటూ ప్రభుత్వం అప్పట్లో 237 జీవోను జారీ చేసింది. దేవస్థానం పేరిట రైత్వారీ పట్టాలను ఇచ్చింది. దేవస్థానం ఈనాం భూములు అలా పంచుకోవడానికి వీల్లేదంటూ దేవాదాయశాఖ అభ్యంతరం చెప్పింది.ఇలా ఏళ్ల తరబడి సాగుతున్న ఈ వివాదంపై ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
 

మరిన్ని వార్తలు