‘పద్మ’ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

30 Jun, 2015 11:40 IST|Sakshi

ఏలూరు (పశ్చిమ గోదావరి): సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసిన వారి నుంచి కేంద్ర ప్రభుత్వ ‘పద్మ’ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఏపీ యువజన సర్వీసుల శాఖ పరిధిలోని సెట్‌వెల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తాము చేసిన సేవా కార్యక్రమాల వివరాలను రెండు పేజీలకు మించకుండా తెలియజేస్తూ జూలై 10 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అర్హమైన వాటిని 2016 పద్మ పురస్కారాలకు సిఫారసు చేస్తామని చెప్పారు. దరఖాస్తులను సెట్‌వెల్, ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఏలూరు చిరునామాకు పంపించాలని తెలిపారు.

మరిన్ని వార్తలు