ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో మార్పు

18 Mar, 2020 18:54 IST|Sakshi

పలు పరీక్షలు ఏప్రిల్, మేలో నిర్వహణ

సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ నిర్వహించే పలు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ కమిషన్‌ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఈనెల 21, 22, 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్, మేలో నిర్వహించేలా కొత్త షెడ్యూళ్లను ప్రకటించింది. (చదవండి: ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు)

ఇంజనీరింగ్‌ ఫీజులపై ప్రభుత్వానికి కమిషన్‌ నివేదిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ తదితర కోర్సులకు కాలేజీల వారీగా ఫీజులు నిర్థారిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ మంగళవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వి. ఈశ్వరయ్య నేతృత్వంలో వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌. భార్గవ రామమోహన్‌రావు, సభ్యకార్యదర్శి డాక్టర్‌ ఎన్‌. రాజశేఖరరెడ్డి, సభ్యులు అశుతోష్‌ మిశ్రా, కల్కి విజయులురెడ్డి, ప్రొఫెసర్‌ డి.ఉషారాణి, డాక్టర్‌ జి.శాంతారావు, ప్రొఫెసర్‌ పి.విజయప్రకాశ్, ఎ.సాంబశివారెడ్డి ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్రను కలిసి నివేదిక అందజేశారు. ఈ నివేదిక పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తుంది. 

మరిన్ని వార్తలు