ఏపీపీఎస్సీ కార్యాలయం ప్రారంభం

21 Dec, 2017 13:37 IST|Sakshi

డీఎస్సీని ఇకపై ఏపీపీఎస్సీ ద్వారానే: ఏపీపీఎస్సీ చైర్మన్‌

సాక్షి, విజయవాడ: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నూతన కార్యాలయాన్ని చైర్మన్‌ పిన్నమనేని ఉదయ భాస్కర్‌ గురువారం ప్రారంభించారు. నగరంలోని ఎంజీ రోడ్డులో గల ఆర్ అండ్ బీ భవనంలోని రెండో అంతస్తును ప్రభుత్వం ఏపీపీఎస్సీ కార్యాలయానికి కేటాయించింది. 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కాగా, జనవరి 2018 నుంచి విజయవాడ నుంచే పూర్తి స్థాయి కార్యాకలాపాలు జరుగుతాయని ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు.

డిసెంబర్‌ నెలాఖరుకు హైదరాబాద్‌ లోని కార్యాలయాన్ని ఖాళీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. గ్రూప్‌ 2 సర్టిఫికేట్‌ వెరిపికేషన్‌ జనవరి రెండో వారంలో విజయవాడలోనే జరుగుతుందని స్పృష్టం చేశారు. కొత్త ఏడాదిలో పోస్టుల భర్తీకి త‍్వరలోనే కొత్త నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. డీఎస్సీని ఇకపై ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా , గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 రెండు పరీక్షలలో సెలక్ట్‌ అయిన వారికి నచ్చిన ఉద్యోగంలో చేరేందుకు ఆఫ్షన్‌ ఇస్తామని ఆయన వెల్లడించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు