వామ్మో.. అట్టపెట్టె

11 Aug, 2015 04:41 IST|Sakshi
వామ్మో.. అట్టపెట్టె

- తీవ్ర ఉత్కంఠతో బాంబు స్వ్కాడ్ తనిఖీలు
- బయటపడ్డ రాగి చెంబు
కడప అర్బన్:
కడప నగరంలోని ఏపీఎస్ ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం సమీపంలో గోడ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన అట్ట పెట్టె సోమవారం రాత్రి కలకలం రేపింది. రాత్రి 7 నుంచి 7.30 గంటల మధ్యలో డయల్ యువర్ 100 నెంబరుకు ఫోన్ చేసి ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం సమీపంలో ఓ అట్ట పెట్టె సీల్ చేసి ఉందని సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ సీఐ కె.రమేష్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు.

అట్ట పెట్టె నుంచి వరిపొట్టు రాలుతుండటంతో వెంటనే బాంబు స్వ్కాడ్‌ను రప్పించారు. మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీ చేస్తే పాజిటివ్ శబ్ధం రావడంతో మరింత అనుమానం పెరిగింది. జాగ్రత్తగా అట్ట పెట్టెను తెరిచారు. లోపల కాగితాలు, దూదితో చుట్టిఉన్న ఓ వస్తువు బయటపడింది. దూదిని తొలగించి చూడగా నల్లటి పేపర్ కవరింగ్‌తో ఓ రాగి చెంబు బయటపడింది. లోపల ఓ పేపరుపై 89784 85881 అనే నెంబరుతో పాటు అర్కట వేముల రవి, అర్కట వేముల జయపాల్, రాంగోపాల్ వర్మ, ఇందిరానగర్ అని పేర్లు రాసి ఉన్నాయి. దీనిపై ఆరా తీస్తామని సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు