ఏపీ సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ

17 Apr, 2020 19:58 IST|Sakshi

సీఎం సహాయ నిధికి ఏపీఎస్‌బీసీఎల్‌ పది కోట్ల విరాళం

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా శుక్రవారం పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు తమ వంతు సాయంగా పలువురు ప్రముఖులు,సంస్థలు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్) 10 కోట్ల విరాళం ప్రకటించింది. ఏపీబీసీఎల్‌ ఉద్యోగుల తరపున కూడా రెండు రోజుల వేతనం 86 లక్షల 5384 రూపాయలను విరాళంగా అందించింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పియూష్‌కుమార్‌ విరాళం చెక్కును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు.
(కరోనా కాలంలో సీఎం జగన్‌ సంచలన నిర్ణయం)

ముఖ్యమంత్రి సహాయనిధికి బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.75 లక్షలు, కేసీపీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ రూ.25 లక్షలు విరాళాలు ప్రకటించాయి. మంత్రి అనిల్‌కుమార్‌, బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ అధ్యక్షుడు పంకజ్‌ రెడ్డి, కేసీపీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ ఎండీ కె. అనిల్‌ కుమార్‌ మొత్తం రూ.కోటి రూపాయల చెక్కును సీఎం వైఎస్‌ జగన్‌​​కు అందించారు.

కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి కాకినాడ రమ్య ఆసుపత్రి రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ పితాని అన్నవరం, డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రభావతి విరాళం చెక్కును సీఎం వైఎస్‌ జగన్‌కు అందజేశారు.

మరిన్ని వార్తలు