దిశ చట్టం మహిళలందరికీ ఆయుధం

15 Dec, 2019 16:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఏపీ దిశ చట్టం’  మహిళలందరికీ ఆయుధం లాంటిదని ఏపీ బాలల హక్కుల పరిరక్షణ సమితి చైర్‌ పర్సన్‌ హైమవతి అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దిశ చట్టం తీసుకొచ్చి రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రక్షణ కల్పించారని ప్రశంసించారు. మహిళలపై నేరాలు చేయాలనుకునే వారికి భయం కలిగేలా చట్టం రూపొందించారని కొనియాడారు. దిశ చట్టాన్ని దేశం మొత్తం తీసుకురావాలని కోరారు. 21 రోజుల్లోనే దోషులకు శిక్షలు పడేలా ఏపీ ప్రభుత్వం చట్టం తీసుకురావడం అభినందనీయం అన్నారు. గతంలో సరైన చట్టాలు లేనందువల్లే నిర్భయ, ఆయేషా మీరా కేసుల్లో దోషులకు ఇప్పటికీ శిక్షలు పడలేదన్నారు. 

కాగా, మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఏపీ దిశ చట్టం-2019’ కు గత శుక్రవారం శాసస సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరుం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ వస్తుంది.

మరిన్ని వార్తలు