ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్‌?

6 May, 2019 16:02 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం :  ఏపీఎస్‌ఆర్టీసీలో మరోమారు సమ్మె సైరన్‌ మోగించేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీలో ఉద్యోగుల కుదింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా సోమవారం ద్వారకా బస్‌ స్టాండ్‌ ఆర్టీసీ ఆర్‌ ఎమ్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. జేఏసీ నాయకులు లక్ష్మి నారాయణ, జయ, రోహిణిల ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లరిబ్బన్లతో ఉద్యోగులు తమ నిరసన తెలియజేశారు. ఉద్యోగులతో సంప్రదించకుండా ఆర్టీసీ ఎండీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు.

మే 23 తర్వాత కార్మికులకు మేలు చేసే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వస్తుందని తెలిసే.. ఆ లోపే ఆర్టీసీని ఏదో చేసేయ్యాలని కుట్ర చేస్తున్నారంటూ జేఏసీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు