ఆధునిక సౌకర్యం..సురక్షిత ప్రయాణం..

31 Oct, 2017 07:59 IST|Sakshi

ఆధునిక హంగులతో ‘అమరావతి’ ‘ఇంద్ర’ సర్వీస్‌లు

సురక్షితంగా  గమ్యస్థానాలకు చేర్చడమే ధ్యేయమంటున్న ఆర్టీసీ అధికారులు

సెమీ స్లీపర్‌ సీట్లు,  టీవీలో చలనచిత్రాల  ప్రదర్శన

కడప అర్బన్‌ : ఏపీఎస్‌ ఆర్టీసీవారు ఆధునిక సౌకర్యాలతో కూడిన అమరావతి, ఇంద్ర సర్వీస్‌లను నడుపుతూ ప్రయాణికుల మన్ననలు పొందుతున్నారు.  కడప డిపో నుంచి బెంగుళూరుకు విజయవంతంగా ‘అమరావతి’ బస్సు సర్వీస్‌ను 2016 జనవరి నుంచి నడుపుతున్నారు.

అమరావతి బస్సు సర్వీస్‌
కడప – బెంగళూరు అమరావతి బస్సు సర్వీస్‌లో ఆధునిక సౌకర్యాలున్నాయి.సెమీస్లీపర్‌ సీట్ల అమరిక, ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించే విధంగా వుంది.
ప్రతి రోజూ కడప నుంచి అమరావతి సర్వీస్‌ మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరుతుం ది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు నుంచి కడపకు మరో బస్సు బయలుదేరుతుంది.
ప్రతి రోజూ రాత్రి కడప నుంచి బెంగళూరుకు 11:45 గంటలకు బయలుదేరుతుంది. బెంగుళూరు నుంచి కడపకు రాత్రి 11:30 గంటలకు బయలుదేరుతుంది.
ఈ సర్వీస్‌లో ఛార్జి రూ.638గా చెల్లించాలి. ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సౌకర్యం వుంది. రిజర్వేషన్‌ చేయించుకున్న వెంటనే సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా మెసేజ్‌ వస్తుంది. సర్వీస్‌ బయలు దేరు సమయానికి అరగంట నుంచి గంటలోపు కండక్టర్‌/డ్రైవర్‌ సెల్‌ నెంబర్లు సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా వస్తాయి. ఏదైనా సమస్యలు తలెత్తినా, ఆయా సెల్‌ఫోన్‌లకు సమాచారం ఇవ్వవచ్చును.

ఇంద్ర బస్సు సర్వీస్‌లు  
ఏపీఎస్‌ ఆర్టీసీ వారు ఆధునిక సౌకర్యాలతో కడప నుంచి ఇంద్ర బస్సులను 2012 నుంచి ప్రారంభించారు.
కడప– విజయవాడకు రాత్రి 9:00 గంటలకు బయలుదేరుతుంది. ఛార్జి రూ. 685గా చెల్లించాలి.
కడప– బెంగళూరుకు ఉదయం 10:30, రాత్రి 11:00 గంటలకు బయలుదేరుతుంది. ఈ బస్సులో ఛార్జి రూ. 460గా వసూలు చేస్తున్నారు.
కడప –చెన్నైకి రాత్రి 11:45 గంటలకు వెళుతుంది. ఛార్జి రూ. 387గా చెల్లించాలి.
కడప– హైదరాబాద్‌ (మియాపూర్‌)– రాత్రి 10:30 గంటలకు వెళుతుంది. ఛార్జి రూ. 741గా చెల్లించాలి.

ప్రయాణికుల సురక్షితమే ధ్యేయంగా సర్వీస్‌లు :
ప్రైవేట్‌ బస్సు సర్వీస్‌లకు ధీటుగా ఆధునిక సౌకర్యాలతో అమరావతి, ఇంద్ర సర్వీస్‌లను విజయవంతంగా నడుపుతున్నాం. పుష్‌ఆప్‌ బ్యాక్‌ సెమీస్లీపర్‌ సీట్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా వున్నాయి. ప్రయాణికుల ఆహ్లాదం కోసం, ఎల్‌ఈడీ టీవీల్లో చలనచిత్రాల ప్రదర్శన రెగ్యులర్‌గా ఉంటుంది. ఏసీ సౌకర్యం ఉంటుంది. ప్రయాణికుల్లో ఆదరణ పెరుగుతోంది. ప్రతీ రోజూ ఈ రెండు బస్సులలో ఉన్న సీట్లన్నీ నిండుతాయన్నారు. ఏవైనా అసౌకర్యాలు కలిగినచో వెంటనే కడప ఆర్టీసీ బస్టాండ్‌ విచారణ కేంద్రం ఫోన్‌ నెంబర్‌: 08562– 244160కు సమాచారం ఇవ్వాలి. – గిరిధర్‌ రెడ్డి, కడప డిపోమేనేజర్‌

మరిన్ని వార్తలు