-

బస్సు ఛార్జీలు పెంచే యోచనలో ప్రభుత్వం

22 Oct, 2013 17:20 IST|Sakshi
బస్సు ఛార్జీలు పెంచే యోచనలో ప్రభుత్వం

హైదరాబాద్: ఆర్టీసి బస్సు ఛార్జీలు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. నిర్వహణ భారం పెరిగిపోవడంతో ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసి అధికారులు చెబుతున్నారు. సీమాంధ్రలో సమ్మె కారణంగా ఆర్టీసికి తీవ్ర నష్టం వాటిల్లింది. దానికి తోడు డీజిల్ ధర కూడా పెరిగింది. ఈ పరిస్థితులలో బస్సు ఛార్జీలు పెంచాలని నిర్ణయించారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఛార్జీలు పెంచుతారు.

అయితే ఛార్జీలను అతిగా పెంచరని, స్వల్పంగానే పెంచుతారని భావిస్తున్నారు. ప్రయాణికులకు మరీ భారంగా లేకుండా పెంపుదల ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు