‘థాంక్యూ సీఎం’.. ఈ విలీనం చరిత్రాత్మకం

1 Jan, 2020 18:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ : విలీన ప్రక్రియ పూర్తి కావడంతో ఆర్టీసీ కార్మికులు నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కృతఙ్ఞత సభలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో జరిగిన ‘థాంక్యూ సీఎం’ కార్యక్రమంలో రవాణా మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, రక్షణ నిధి, జగన్మోహన్‌రావు, ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు, వైఎస్సార్‌ ట్రేడ్ యూనియన్ నాయకులు గౌతమ్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు మాట్లాడుతూ..
(చదవండి : కార్మికుల కల సాకారం)

‘ఇది ఒక కొత్త అధ్యాయం. విలీన ఆద్యులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. తన పాదయాత్ర సమయంలో ఆర్టీసీ కార్మికుల జీవన స్థితిగతులు తెలుసుకున్న నాయకులు వైఎస్‌ జగన్‌ 2019, జూన్‌ 10న తొలి కేబినెట్‌ మీటింగ్‌లోనే విలీన ప్రక్రియ గురించి ప్రస్తావించారు. విలీన ప్రక్రియపై ఎక్స్‌పర్ట్‌ కమిటీ వేసి కమిటీ నివేదిక ద్వారా నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ విలీనాన్ని నూతన సంవత్సర కానుకగా  ఇవ్వడం చరిత్రాత్మకo’అన్నారు.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల గుండెల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఆర్టీసీ చనిపోయేలా చేశారు. సీఎం జగన్‌ ఆర్టీసీకి జీవం పోశారు. కార్మికుల, కర్షకులకు నచ్చిన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ ప్రైవేటు బస్సులను కట్టిడి చేసేందుకు చర్యలు చేపట్టాలి. అప్పుడే ఆర్టీసీ మనుగడ సాగిస్తుంది’అన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం లో విలీనం చేయడం సాహాసోపేత నిర్ణయమని ఎమ్మెల్యే రక్షణ నిధి అన్నారు. 

మరిన్ని వార్తలు