టూరిజం బోటింగ్‌ పునఃప్రారంభం

19 Jan, 2020 19:07 IST|Sakshi

సాక్షి, విశాఖ: టూరిజం బోటింగ్‌ పున:ప్రారంభం అయింది. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రుషికొండ, హార్బర్‌ వద్ద నిర్వహిస్తున్న టూరిజం బోటింగ్‌ను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం రుషికొండ బీచ్‌ వద్ద బోటింగ్‌ను పునఃప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక బోట్లకు అనుమతులు ఇస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. పర్యాటకులకు స్వర్గధామమైన విశాఖలోని రిషికొండలో నాలుగు పర్యాటక బోట్లను మంత్రి ప్రారంభించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. 

పర్యాటక బోట్ల నిర్వాహకులు నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. స్పీడ్‌, జెట్‌ స్కీ బోట్లు, లైఫ్‌ గార్డుల శిక్షణ, పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు, బీమా సౌకర్యంతో జల విహారాన్ని ప్రారంభించారు. దీంతో పర్యాటకులకు నేటి నుంచి జల విహారం అందుబాటులోకి వచ్చింది. కాగా తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు పడవ ప్రమాదం తర్వాత బోట్ల రాకపోకలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు