కేఎల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు

2 Jul, 2015 03:31 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కేఎల్ యూనివర్సిటీలో 2015-16 విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ వైస్ చైర్మన్ కోనేరు రాజా హరేన్ తెలిపారు. ఐదేళ్ల బీఆర్క్, లా, ఫైన్ ఆర్ట్స్‌లో పలు కోర్సులను ప్రారంభిస్తున్నామని వివరించారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌ను అన్ని అనుమతులతో ప్రారంభిస్తున్నామన్నారు.

మొదటి సంవత్సరం 40 సీట్లు ఉన్నాయన్నారు. బీబీఏ, ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల లా కోర్సును కూడా ప్రారంభిస్తున్నామని, వాటికి కొద్దిరోజుల్లోనే అనుమతి వస్తుందన్నారు.  వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎల్‌ఎల్‌ఎస్ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రభుత్వ అనుమతులతో  కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా 1,680 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయన్నారు.
 
 

మరిన్ని వార్తలు