అర్హులందరికి సంక్షేమ పధకాలు అందాలి

22 Sep, 2014 02:44 IST|Sakshi
అర్హులందరికి సంక్షేమ పధకాలు అందాలి

అనంతపురం రూరల్: అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత అధికారులకు స్పష్టం చేశారు. ఆదివారం ఆమె తన నివాసంలోఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ... నిరుద్యోగ యువతకు అండగా ఉండి, ఉపాధి కల్పనకు రుణాలు మంజూరు చేయించాలని సూచించారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం దళితులకు కేటాయించిన నిధులను వారి నివాస ప్రాంతాల్లో తాగునీరు, డ్రెయినేజీలు, సీసీరోడ్ల ఏర్పాటు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, తదితర మౌలిక సదుపాయాల కోసం వినియోగించాలని ఆదేశించారు. అంతేగాకుండా హాస్టళ్లలో కనీస వసతులు లేవని ఫిర్యాదులందుతున్నాయని వాటిపై దృష్టి సారించాలన్నారు. మైనార్టీ శాఖ ద్వారా షాదీఖానాలు, మసీదులు, చర్చిలు, స్మశాన వాటికల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జయరాం, బీసీ కార్పొరేషన్ అధికారి నాగముని, మైనార్టీ కార్పొరేషన్ అధికారి ఖాజామొహిద్దీన్, గిరిజన సంక్షేమాధికారి ప్రేమ్ కుమార్, మైనార్టీ సంక్షేమ శాఖాధికారి దాస్, ఆన్‌సెట్ సీఈఓ గీతాగాంధీ వాణి, తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు