భార్యతో మాట్లాడుతుండగానే..

1 Sep, 2019 09:27 IST|Sakshi
ఇటీవల స్వగ్రామం వచ్చినప్పుడు భార్య, కుమారుడితో సెల్ఫీ తీసుకుంటున్న మృతుడు బైరాగి (ఫైల్‌)

పిడుగు పడి ఆర్మీ జవాన్‌ మృతి

భార్యతో వాట్సాప్‌లో మాట్లాడుతుండగా ఘటన

విషాదంలో బిర్లంగి తోటూరు   

సాక్షి, ఇచ్ఛాపురం రూరల్‌: పది రోజుల కిందట కుమారుడితో ఆనందంగా గడిపిన ఆ తండ్రి ఇక ఆ బిడ్డకు లేడు. భార్యాపిల్లలతో కలిసి సరదాగా గడిపిన మనిషి మరి లేరు. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి తోటూరు గ్రామానికి చెందిన దుంప అప్పారావు, లక్ష్మమ్మల మూడో సంతానం దుంప బైరాగి(28) ఆర్మీలో విధులు నిర్వహిస్తూ పిడుగుపాటుకు గురై శుక్రవారం మృతి చెందారు. బైరాగి ఎనిమిదేళ్ల క్రితం ఆర్మీ జవాన్‌గా రాజస్థాన్‌లో విధుల్లో చేరి రెండున్నరేళ్ల క్రితం దివ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే తండ్రి మృతి చెందడంతో కుటుంబ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నాడు.

25 రోజుల కిందటే స్వగ్రామానికి సెలవుపై వచ్చిన బైరాగి 18 నెలల కుమారుడు యశ్వంత్‌ను క్షణం కూడా వదలకుండా గడిపాడు. పది రోజుల పాటు పిల్లా పాపలతో ఉండి పదిహేను రోజుల క్రితమే రాజస్థాన్‌ వెళ్లిపోయాడు. శుక్రవారం విధుల్లో ఉండగానే సాయంత్రం నాలుగు గంటల సమయంలో భార్య దివ్యతో వాట్సాప్‌లో మాట్లాడుతుండగా పెద్ద శబ్దం వినిపించి ఫోన్‌ కట్‌ అయిపోయింది. ఆ సమయంలోనే పిడుగు పడి బైరాగి మృతి చెందారు. ఈ విషయాన్ని శుక్రవారం అర్ధరాత్రి సంబంధిత అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో గ్రామం ఒక్క సారిగా విషాదంలో మునిగిపోయింది. ఆదివారం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంటుందని బంధువులు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరకట్టపై పల్టీకొట్టిన ఆర్టీసీ బస్సు

భార్యను కడతేర్చిన భర్త

అమ్మా, నాన్నా.. నేను చేసిన నేరమేమి?

దిగొస్తున్న సిమెంట్‌ ధరలు..

‘మొక్క’ తొడిగిన ‘పచ్చని’ ఆశయం 

దాహం.. దాసోహం!

వసతిగృహంలో ర్యాగింగ్‌ భూతం

పరారీలోనే చింతమనేని?

అందరికీ పరీక్ష..

అన్నవరం దేవస్థానంలో అగ్నిప్రమాదం

ఆ ముగ్గురి మోసమే కొంపముంచింది

ఏసీబీకి చిక్కిన ‘సర్వే’ తిమింగలం

పాలకులకు ఇవ్వాలి సమయం

ఆంధ్రాబ్యాంక్‌ ఇక కనపడదు 

జలం వర్షించే.. పొలం హర్షించే

అన్న క్యాంటీన్లలో కమీషన్ల భోజనం

మద్యనిషేధంలో మరో ముందడుగు

నేటి నుంచే ‘సచివాలయ’ పరీక్షలు

వనం ఉంటేనే మనం

టన్ను ఇసుక రూ.375

విశాఖలో భారీ వర్షం

కరకట్టపై బస్సు ప్రమాదం; ఎమ్మెల్యే సహాయం

నిర్మలా సీతారామన్‌కు కేవీపీ లేఖ

ఈనాటి ముఖ్యాంశాలు

‘మెరిట్ ఆధారంగానే సచివాలయ పోస్టుల భర్తీ’

జన సైనికుడి ఘరానా మోసం

ఆ ఘనత వైఎస్సార్‌దే

వన మహోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ ట్వీట్‌

నూతన ఇసుక పాలసీ అమలుకు ప్రభుత్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సిటీతో ప్రేమలో పడిపోయాను

వీడే సరైనోడు

ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు

సింధుగా సమంత?

క్రైమ్‌ పార్ట్‌నర్‌

ముద్దంటే ఇబ్బందే!