ఏడోరోజూ అదే స్పందన

8 Mar, 2014 02:50 IST|Sakshi

 విజయనగరం కంటోన్మెంట్/క్రైం, న్యూస్‌లైన్:
 జిల్లా పోలీస్‌పరేడ్ మైదానంలో జిల్లా యంత్రాం గం నేతృత్వంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి ఏడవ రోజు మంచి స్పందన లభించింది. సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ పోస్టులకు సంబంధించి శుక్రవారం విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ప్రాథమిక ఎత్తు, ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించగా ఈ ఎంపికలకు ఆయా ప్రాంతాల నుంచి మొత్తం 2960 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 1600 మంది అభ్యర్థులు శనివారం నిర్వహించనున్న దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించినట్లు సెట్విజ్‌సీఈఓ పి.దుర్గారావు తెలిపారు. ఎంపిక ప్రక్రియను బ్రిగేడియర్ ఎస్‌బీ సజ్జన్, డిప్యూటీ డెరైక్టర్ జనరల్ (స్టేట్స్) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, అండమాన్ గ్రూప్  ఆఫ్ ఐలాండ్స్) కల్నల్ పి.పి.సింగ్ తదితరులు పర్యవేక్షించగా..  ర్యాలీలో ఎటువంటి అవాంఛనీ య సంఘటనలు తలెత్తకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం బందోబస్తు నిర్వహించారు.
 
 నేడు జరిగే ఎంపికల వివరాలు:
 ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ర్యాలీలో భాగంగా సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు శ్రీకాకుళం, విశాఖ పట్నం, కృష్ణ జిల్లాలతో పాటు యానాం ప్రాంతానికి చెందిన అభ్యర్థులకు శనివారం  ప్రాథమిక ఎత్తు ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.  ఈ ఎంపికలకు అభ్యర్థులు 1991 మార్చి 2 నుంచి 1996 సెప్టెంబర్1వ తేదీ మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు. అదేవిధంగా ఇంటర్మీడియెట్/తత్సమాన పరీక్షలో ఆర్ట్స్, కామర్స్, సైన్స్, మేథ్స్, ఇంగ్లీషు సబ్జెక్టులతో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటు ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం మార్కులు కలి గి ఉన్న వారు ఆపై విద్యార్హతలు కలిగిన వారు ఎంపికలకు హాజరుకావచ్చు. 162 సెంటీమీటర్ల ఎత్తు, 50 కేజీల బరువు, ఛాతి 77-82 సెంటీమీటర్లు కలిగిఉండాలి. డిఫెన్స్ సర్వీస్ కార్ప్స్ కేటగిరీకి సంబంధించి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు  ధ్రువీకరణ ప త్రాల పరిశీలిస్తారని సెట్విజ్ సీఈఓ తెలిపారు.
 

మరిన్ని వార్తలు