గుంటూరులో రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

8 Oct, 2014 02:24 IST|Sakshi

విద్యానగర్(గుంటూరు): గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈనెల 9 నుంచి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన యువకులు ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనవచ్చు. సర్టిఫికెట్ల పరిశీలన, దేహదారుఢ్యం, శరీరకొలతలు, పోలీస్ వెరిఫికేషన్, వైద్య, రాత పరీక్షల విధానాల ద్వారా ఈ ఎంపిక చేస్తారు. సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్‌మెన్, సోల్జర్ క్లర్క్, స్టోర్‌కీపర్, టెక్నికల్ క్యాటగిరీల్లో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.  500 పోస్టుల భర్తీకి ఈ ర్యాలీ జరుగుతున్నట్లు రిక్రూటింగ్ డెరైక్టర్ కల్నల్ అఫ్సర్ జాఫ్రి తెలిపారు. ఏఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి.. ఎలా సిద్ధపడాలి అనే విషయాలను ఇలా వివరించారు..
 
ఎంపికకు అవసరమైన సర్టిఫికెట్లు

విద్యార్హత మార్కుల లిస్టులు, కుల ధ్రువీకరణ పత్రం, కాండక్ట్ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, పుట్టినతేదీ సర్టిఫికెట్ తదితర సర్టిఫికెట్లు మండల తహశీల్దార్ సంతకంతో ఆఫీసు ముద్రతో ఉండాలి.అన్ని పత్రాలు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, 20 పాస్‌పోర్టుసైజు ఫొటోలు వెంట తీసుకురావాలి. అన్ని సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఇంగ్లిష్‌లో ఉండాలి.
     
అభ్యర్థులు వసతి, ఆహారం సొంతంగానే ఏర్పాటు చేసుకోవాలి. మంచినీరు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. సెల్‌ఫోన్లు అనుమతించరు.మాజీ సైనికుల కుమారులు, యుద్ధ వితంతువుల కుమారులు, యుద్ధంలో చనిపోయినవారి కుమారులు సంబంధిత రిలేషన్ సర్టిఫికెట్లను తీసుకురావాలి.21 సంవత్సరాలలోపు వివాహం జరిగిన అభ్యర్థులు ఎంపికకు అనర్హులు.శరీరంపై పచ్చబొట్లు ఉంటే అనర్హులు.
 
అభ్యర్థులకు పరీక్షలు ఇలా..

1.6 కిలోమీటర్ల పరుగుపందెం 6 నిమిషాల 20 సెకన్లలోపు పూర్తి చేయాలి. అదేవిధంగా 9 అడుగుల లాంగ్‌జంప్, పుష్‌అప్స్ కనీసం 6 తీయాలి. ఒక కడ్డీపై నిలబడి బ్యాలెన్స్‌గా చేతులు చాపి నడవాలి. సోల్జర్ జనరల్ డ్యూటీలో 1.6 కిమీ పరుగు పందేన్ని రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో 5 నిముషాల 20 సెకన్లలోపు, రెండవ గ్రూపు 6 నిముషాలలోపు పూర్తి చేయాలి. ఫిజికల్ టెస్ట్‌లో ఎంపికైనవారు అనంతరం మెడికల్, రాతపరీక్షకు హాజరవాలి. రాత పరీక్షలో సమాధానాల్లో ప్రతి తప్పునకు నాలుగవ వంతు మార్కు కట్ చేస్తారు.

 అభ్యర్థుల అర్హతలు

సోల్జర్ టెక్నికల్ విభాగం: సైన్స్ సబ్జెక్టుతో కూడిన ఇంటర్ పాసై ఉండాలి
సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్:  సెన్స్ సబ్జెక్టుతో కూడిన ఇంటర్. అదేవిధంగా 3 సంవత్సరాల డిప్లొమా  
సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ : ఇంటర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బ యాలజీలలో కనీసం 40 శాతం మార్కులతో పాసై ఉండాలి. (పై పోస్టులకు ఛాతీ 77 సెంటీ మీటర్లు కలిగి ఉండాలి. గాలి పీల్చినపుడు 5 సెంమీ వ్యాకోచం కలిగి ఉండాలి. బరువు 50 కేజీలకు పైగా, 165 సెంమీ ఎత్తు ఉండాలి. 17 సంవత్సరాల 6 నెలల నుంచి 23 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి)

సోల్జర్ జనరల్ డ్యూటీ: 10వతరగతి ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులతో పాసై ఉండాలి. మొత్తం మార్కులలో 40 శాతం కలిగి ఉండాలి. ఎత్తు 166 సెంమీ ఎత్తు కలిగి ఉండాలి. {sేడ్‌మెన్: 8వ తరగతి పాసై ఉండాలి. పదవతరగతి పా సైన అభ్యర్థులకు ఇందులోనే ఉన్నత స్థానాలు కల్పిస్తారు. ఛాతీ 76 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. గాలి పీల్చినపుడు 5 సెంమీ వ్యాకోచం కలిగి ఉండాలి. బరువు 48 కేజీలకు పైగా ఉండి 166 సెంమీ ఎత్తు కలిగి ఉండాలి సోల్జర్ క్లర్క్/స్టోర్ కీపర్: ఇంటర్  40 శాతం మార్కులతో పాసై ఉండాలి. అభ్యర్థులు ఇంగ్లిష్, గణితం, అకౌంట్స్, బుక్‌కీపింగ్ తదితర సబ్జెక్టులలో తప్పనిసరిగా 40శాతం మార్కులు కలిగి ఉండాలి. ఛాతీ 77 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినపుడు 5 సెంమీ వ్యాకోచం కలిగి ఉండాలి. బరువు 50 కేజీలకు పైగా ఉండి 162 సెంమీ ఎత్తు తప్పనిసరిగా ఉండాలి.

http://img.sakshi.net/images/cms/2014-10/51412715245_Unknown.jpg
 
 

మరిన్ని వార్తలు